రాజ్ తరుణ్ హీరోగా, రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ పాంచ్ మినార్. రాశి సింగ్ హీరోయిన్. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సాయి రాజేష్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ చాలా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. అందరూ థియేటర్స్‌కి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్లే సినిమా. మా ప్రొడ్యూసర్ మాధవి చాలా ప్యాషన్‌తో తీశారు. గోవింద్ ఈ సినిమాని తన భుజాల మీద వేసుకుని నడిపించారు. డైరెక్టర్ రామ్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఇప్పటికే ప్రీమియర్స్ వేశాం. చూసిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. 19, 20 తేదీల్లో కూడా మళ్లీ ప్రీమియర్స్ వేయాలని నిర్మాతలు భావిస్తున్నారు అని తెలిపారు.

ప్రతి క్యారెక్టర్ మీకు గుర్తుండిపోతుంది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకునే క్రైమ్ కామెడీ సినిమా అవుతుంది ఫ్యామిలీ అందరితో కలిసి చూడొచ్చు. ఇప్పటికే నాలుగు ప్రివ్యూస్ వేశాం అందరికీ నచ్చింది. త్వరలోనే పెయిడ్ ప్రివ్యూస్ వేయబోతున్నాం. అందరూ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అని డైరెక్టర్ రామ్ చెప్పారు. నిర్మాతలు గోవిందరాజు, మాధవి మాట్లాడుతూ ఈ సినిమా స్క్రీన్ ప్లేని ఫిలిం స్కూల్ స్టడీ మెటీరియల్‌గా పెడతారు. అంత అద్భుతంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే నచ్చే ఈ సినిమా చేశాం. రాజ్ తరుణ్, నటీనటులు అందరూ అద్భుతంగా చేశారు. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది అని అన్నారు. ఈనెల 21న ఈ చిత్రం విడుదల కానుంది.
















