ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. అయితే ఆయన ఆ పదవి కోరుకోవడం లేదని తెలుస్తోంది. క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని వైవీ సుబ్బారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అయితే సీఎం జగన్ మాత్రం ఆయనను రెండోసారి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ తాజా నిర్ణయంతో వైవీ సుబ్బారెడ్డి మరోసారి టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డి పదవి కాలం ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వైవీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.