Namaste NRI

ఇండస్ట్రీలోకి మరో నందమూరి హీరో – హరికృష్ణ మనవడిని పరిచయం చేసిన వై.వి.ఎస్‌. చౌదరి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, బాలకృష్ణ, హరికృష్ణ ఇలా ఎందరో సూపర్‌ స్టార్స్‌ ఉన్నారు. తాజాగా ఈ కుటుంబం నుంచి మరో యంగ్ హీరో ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు తారక రామారావు హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమాను వైవీఎస్‌ చౌదరి తెరకెక్కించనున్నారు.  ప్రొడక్షన్‌ నంబర్‌ 1గా రాబోతున్న ఈ చిత్రాన్ని న్యూ టాలెంట్‌ రోర్స్  బ్యానర్‌లో వైవీఎస్‌ చౌదరి సతీమణి యలమంచిలి గీత నిర్మిస్తుండటం విశేషం.

నందమూరి తారకరామారావు హీరోగా గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఫస్ట్‌ దర్శన్‌ వీడియో చెప్పకనే చెబుతోంది. నటుడిగా అందరినీ ఇంప్రెస్ చేసేందుకు యాక్టింగ్‌, ఫైట్స్‌లో శిక్షణ తీసుకోవడంతోపాటు మేకోవర్ కూడా మార్చుకున్న ట్టు తాజా లుక్స్‌తో తెలిసిపోతుంది. ఈ చిత్రానికి లెజెండరీ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా,  సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు సమకూరుస్తున్నారు. చంద్రబోస్ పాటలు అందిస్తున్నాడు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events