రష్యాకు వచ్చిన ఉత్తర కొరియా సేనలు యుద్ధ రంగంలోకి దిగడం కోసం వేచి చూడటం ఆపి, తగిన చర్యలను ప్రారంభించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ మిత్ర దేశాలను కోరారు. ఉత్తర కొరియా సేన లు ఎక్కడ ఉన్నదీ తమకు తెలుసునని, వారిపై ముందుగానే తాము దాడి చేయవచ్చునని అన్నారు. అయితే, పాశ్చాత్య దేశాలు తయారు చేసిన దీర్ఘ శ్రేణి ఆయుధాలను రష్యాలోని లక్ష్యాలపై దాడి చేయడానికి ఉపయో గించడం కోసం మిత్ర దేశాల అనుమతి అవసరమని చెప్పారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ రష్యా చర్యలను చూస్తూ ఉన్నాయని, ఉత్తర కొరియా సైన్యం ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించడం కోసం వేచి చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 8,000 మంది ఉత్తర కొరియా సైనికులు రష్యాకు వెళ్తున్నట్లు అమెరికా వెల్లడించింది. వీరిలో 7,000 మందికి రష్యాలో ఐదు చోట్ల శిక్షణ ఇస్తున్నారని ఉక్రెయిన్ చెబుతున్నది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)