
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తన కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా ఉన్న యూలియా స్విరిడెన్ కో ను ఉక్రెయిన్ కొత్త ప్రధానిగా నియమించారు. కాగా 2022 లో రష్యాతో జరిగిన యుద్ధం తర్వాత ఈ పదివిలోకి వచ్చిన తొలి వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. యుద్ధంతో అలసిపోయిన దేశ ప్రజల్లో నూతన ఉత్సాహం నింపేందుకు, స్థానికంగా ఆయుధ ఉత్పత్తిని పెంచేందుకు, కేబినెట్ మార్చుతున్నట్టు జెలెన్స్కీ ప్రకటించారు.
















