Namaste NRI

జుకర్‌బర్గ్‌ వార్నింగ్‌ … రానున్న రోజుల్లో మరిన్ని

ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా ఈసీవో మార్గ్ జుకర్‌బర్గ్‌  రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగుల్ని తొలగించేలా ఉన్నారు. తాజాగా కంపెనీలోని మేనేజర్లు, డైరెక్టర్లకు మార్క్ జుకర్‌బర్గ్‌  ఇచ్చిన వార్నింగ్ చూస్తుంటే, రానున్న రోజుల్లో మెటాలో మరిన్ని లేఆఫ్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.  గతవారం కంపెనీలో జరిగిన సమావేశం సందర్భంగా కేవలం సిబ్బందితో పని చేయించడమే కాకుండా పనిలో వ్యక్తిగత పాత్ర ఉండాల్సిందే అని మేనేజర్లు, డైరెక్టర్ స్థాయి ఉద్యోగులను జుకర్ బర్గ్ హెచ్చరించారు. ఈ ఏడాది మరింత ఎఫీషియెన్సీ కనబరచాల్సిందే అని తేల్చిచెప్పారు. కోడింగ్, డిజైనింగ్, రీసెర్చ్ వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. లేనిపక్షంలో కంపెనీ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. తాజాగా జుకర్‌బర్గ్‌ వార్నింగ్‌తో  ఆ సంస్థలోని ఉద్యోగుల్లో మరోసారి లేఆఫ్స్ భయాలు మొదలయ్యాయి.

Social Share Spread Message

Latest News