సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తా మీనన్ హీరోయిన్. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ద్వారా కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. టీజర్ నేడు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అగ్ర హీరో పవన్ కల్యాణ్ టీజర్ ను వీక్షించారు. నిర్మాత మాట్లాడుతూ పవన్ కల్యాణ్ గారికి టీజర్ బాగా నచ్చింది. విజువల్స్, బీజీఎం అన్నీ బాగున్నాయని ప్రశంసించారు. సాయి ధరమ్ తేజ్ నటించిన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన చిత్రమిది. ఆయన పాత్ర కొత్త పంథాలో ఉంటుంది అని చెప్పారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్ సైనుద్దీన్, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగల, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్.
