తొలి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (ఎస్ విబిటిసిసి) ఆధ్వర్యంలో లండన్లోని బాలాజీ దేవాలయంలో శ్రీనివాసుడి కల్యాణం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా స్థానిక రాజకీయ ప్రముఖులు ఎర్లీ అండ్ వుడ్లీ పార్లమెంట్ సభ్యురాలు యువాన్ యాంగ్, వోకింగ్హామ్ మేయర్ మేడం క్యారొల్ జ్యూవెల్, హిల్సైడ్ కౌన్సిలర్ పాలిన్ జార్గెన్సెన్ హాజరయ్యారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


ఈ వేడుకల్లో పిల్లలుతో పాటు పలువురు కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంగీతం, నృత్యం, భక్తి కళల ద్వారా భారత సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఇచ్చారు. స్వదేశంలో లేకున్నా తొలి ఏకాదశి రోజున కల్యాణం నిర్వహించడం ఆశీర్వాదంగా భావిస్తున్నామని తెలిపారు. లండన్లోని ఆధ్యాత్మిక, సామాజిక జీవితాన్ని ప్రోత్సహించడంలో ఎస్ విబిటిసిసి కొన్నేళ్లుగా తనవంతు పాత్ర పోషిస్తోంది. ఈ స్థాయి స్పందన ఊహించలేదని నిర్వాహకులు పేర్కొన్నారు. 1800 మందికి పైగా భక్తులు హాజరయ్యారు.



















