టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. వ్యాపారవేత్త అనూష శెట్టితో ఆయన పెండ్లి వేడుకలు బెంగుళూరులోని ఓ స్టార్ హోటల్లో జరిగాయి. శనివారం నుంచే వీరి వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. మెహందీ, కాక్ టెయిల్ పార్టీలు నిర్వహించారు. బంధుమిత్రులు, సన్నిహితులు ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. హీరోలు నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి కొందరు సహ కథానాయకులు ఈ వేడుకకు హాజరయ్యారు. కొత్త దంపతులు నాగశౌర్య, అనూషకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.














