Skip to main content

Namaste NRI

యూఏఈ వెళ్లే భారతీయులకు అలర్ట్ .. వీసా నిబంధనల్లో కీలక మార్పులు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఇది ముఖ్యమైన గమనిక అని చెప్ప‌వ‌చ్చు. కేవలం భారత పాస్‌పోర్ట్ కలిగి ఉన్నంత మాత్రాన యూఏఈలో వీసా ఆన్ అరైవల్ సౌకర్యం లభించదు. నిర్దిష్ట దేశాల నుంచి పొందిన వ్యాలిడ్ వీసా లేదా రెసిడెన్స్ పర్మిట్ (నివాస అనుమతి) ఉన్న భారతీయులకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. విదేశాల్లో నివసించే లేదా ప్రయాణించే భారతీయుల కోసం ప్రయాణ ప్రక్రియను సులభతరం చేసే లక్ష్యంతో యూఏఈ ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించింది.

ఈ వీసా ఆన్ అరైవల్ సౌకర్యం పొందాలంటే భారతీయ పౌరులు కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. వారి సాధారణ పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ కలిగి ఉండాలి. దీంతోపాటు ఆస్ట్రేలియా, కెన‌డా, జ‌పాన్ త‌దిత‌ర‌ దేశాల నుంచి జారీచేసిన వ్యాలిడ్ వీసా, గ్రీన్ కార్డ్ లేదా రెసిడెన్స్ పర్మిట్ తప్పనిసరిగా ఉండాలి. గతంలో ఈ సౌకర్యం కేవలం అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ లేదా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల వీసా లేదా రెసిడెన్స్ పర్మిట్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే 2025 ఫిబ్రవరి 13 నుంచి యూఏఈ ప్రభుత్వం ఈ జాబితాను విస్తరించింది. కొత్తగా ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల రెసిడెన్స్ పర్మిట్లు ఉన్న భారతీయులకు కూడా ఈ అర్హతను కల్పించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events