Skip to main content

Namaste NRI

నయనతార మూవీ హాయ్ .. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌

అగ్ర కథానాయిక నయనతార, యువహీరో కెవిన్‌ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ హాయ్. విష్ణు ఎడ్విన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ చక్కటి హాస్యం, కుటుంబ బంధాలు, భావోద్వేగాల సమాహారంగా సాగే ఫీల్‌గుడ్‌ మూవీ ఇది. ఎలాంటి విలన్‌ పాత్ర లేకుండా ఆద్యంతం వినోదంతో ఆకట్టుకుంటుంది. చెన్నై, కోయంబత్తూర్‌, పొల్లాచ్చి నేపథ్యంలో కథ సాగుతుంది. నయనతార పాత్ర నవ్యరీతిలో ఉంటుంది అని చెప్పారు. ఈ సినిమాకు నయనతార ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నది. ఆగస్ట్‌ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. జీ స్టూడియోస్‌, ది రౌడీ పిక్చర్స్‌, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో పతాకాలపై విఘ్నేష్‌ శివన్‌, ఎస్‌.ఎస్‌.లలిత్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News