
ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఎన్‌బీకే 111 (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాకినాడ పోర్ట్‌లో బాలకృష్ణ, మంచు మనోజ్‌లపై ఈ సినిమాకు చెందిన యాక్షన్ సీన్స్‌ని గోపీచంద్ తెరకెక్కిస్తున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో బాలకృష్ణ కాలి కండరానికి బలమైన కోత పడింది. దాంతో అప్రమత్తమైన చిత్రబృందం షూటింగ్‌ని మధ్యలోనే నిలిపివేశారు. వైద్యుల ప్రాథమిక చికిత్స అనంతరం స్కానింగ్ కోసం కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రికి బాలయ్యను తరలించారు. గాయం చిన్నదేననీ, త్వరగా కోలుకునేందుకు మైనర్ సర్జరీ చేయాల్సివున్నదని, ప్రస్తుతానికైతే ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.





























