Skip to main content

Namaste NRI

ఈ సినిమాతో ఆ గౌరవం దక్కింది : శ్రీకర్

ఇటీవల ప్రకటించిన 72వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ బాల నటుడు విభాగాల్లో రెండు అవార్డ్స్ గెల్చుకుంది 35 చిన్న కథ కాదు సినిమా. ఈ చిత్రంలోని నటనకు ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల. తను ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ అనే బాలల చిత్రంలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో 35 చిన్న కథ కాదుమూవీ టీమ్ ను అభినందించారు సమ్మర్ హాలిడేస్ సినిమా టీమ్.

సమ్మర్ హాలిడేస్చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. శ్రీకర్ దర్శకుడు. శ్రీకర్ మాట్లాడుతూ ఎప్పుడో 30 ఏళ్ల కిందట బాల రామాయణం తెలుగు సినిమాకు ఉత్తమ బాలల చిత్రం అవార్డ్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాతో ఆ గౌరవం దక్కింది. అరుణ్ మంచి నటుడు. మా సినిమాలోనూ నటిస్తున్నాడు. అరుణ్ పర్ ఫార్మెన్స్ చూస్తుంటే అతను నవ్వితే నేను నవ్వాను, ఏడిస్తే ఏడ్చానుఅని తెలిపారు. కథను నమ్మి ప్రియదర్శి, నివేదా, దర్శక, నిర్మాతలు 35 చిన్న కథ కాదు చేశారు. ఓటీటీలో సినిమా చూసినప్పుడు థియేటర్ లో ఈ సినిమా మరింతగా ఆదరణ పొందాల్సింది అనిపించింది. నేను ఈ సినిమా ప్రొడ్యూస్ చేసేందుకు స్ఫూర్తినిచ్చిన సినిమా ఇది అని ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events