Skip to main content

Namaste NRI

థమన్‌ విడుదల చేసిన ముఖ చిత్రం సాంగ్‌

వికాస్‌ వశిష్ట, ప్రియ వడ్లమాని,  చైతన్య రావ్‌, అయేషా ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ముఖచిత్రం. కలర్‌ ఫొటో మూవీతో హిట్‌ కొట్టిన దర్శకుడు సందీప్‌ రాజ్‌ ఈ సినిమాకు కథ స్క్రీన్‌ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రంలోని క్లాస్‌ రూమ్‌లో అనే గీతాన్ని సంగీత దర్శకుడు తమన్‌ విడుదల చేశారు. ఈ పాటకు కాలభైరవ  స్వరాలు సమరకూర్చడంతో పాటు సింధూరి విశాల్‌తో కలిసి ఆలపించారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యమందించారు. పాట చాలా బాగుందన్న థమన్‌ చిత్రబృందానికి బెస్ట్‌ విశేష్‌ తెలిపారు.  గంగాధర్‌ దర్శకుడు. ప్రదీప్‌ యాదవ్‌, మోహన్‌ యల్ల సంయుక్తంగా నిర్మించారు. ఎస్‌కేఎన్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షక్షుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News