Namaste NRI

మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం

మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం చేరింది. చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డు వరించింది. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చలనచిత్రోత్సవం ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించారని పేర్కొంది. చిరంజీవి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నటుడిగా, నిర్మాతగా 150 చిత్రాలకు పైగా పలు సినిమాల్లో నటించారు. విశిష్టమైన కెరీర్ను కలిగి ఉన్నారు. అతను హృదయాలను హత్తుకునే అద్భుతమైన ప్రదర్శనలతో తెలుగు సినిమాల్లో విపరీతమైన ప్రజాదరణ పొందారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గోవా వేదికగా ఇఫీ చలనచిత్రోత్సవం నేటి (నవంబరు 20) నుంచి ఈ నెల 25 వరకు జరగనుంది.

Social Share Spread Message

Latest News