Skip to main content

Namaste NRI

ఇరాన్ హిట్‌లిస్టులో … 13 మంది విదేశీ నేత‌లు!

పశ్చిమాసియాలో యుద్ధం ఆగినట్టే కనిపించినా ఇటీవల మళ్లీ ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హర్మూజ్ జ‌ల‌సంధి గుండా ప్రయాణిస్తున్న‌ నౌకలపై ఐఆర్‌జీసీ దాడులు చేయడం తాజా ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో 13 మంది విదేశీ నేతల పేర్లతో ఉన్న రివేంజ్‌ లిస్ట్‌ను ప్రచురించింది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సహా పలువురు ఐరోపా నేతల‌ పేర్లు ఉన్నాయి.

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నాటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ఇటీవ‌ల మొజ్తాబా ఖమేనీ ప్రతిజ్ఞ చేశారు. బాధ్యులైన వారు పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇది తమ దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ అని, దానిని కచ్చితంగా నెరవేరుస్తానని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతీకార జాబితా బయటకు రావడం చర్చనీయాంశమైంది.

Social Share Spread Message

Latest News