నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి అలియాస్ రుక్మిణీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హీరో నాని సమర్పణలో యునానిమస్ ప్రొడక్షన్ పతాకంపై రెండో ప్రయత్నంగా ఈ తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మురళీకాంత్ దేవసోత్ దర్శకుడు. దీప్తి గంటా నిర్మాత. ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్‌నివ్వగా, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. ఇదొక అందమైన ప్రేమకథ అని, ప్రేక్షకులకు చాలాకాలం గుర్తుండిపోతుందని, త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని నాని తెలిపారు.

కోర్ట్ తర్వాత ఎన్నో కథలు విన్నాం. ఈ కథలో కొత్తదనం బాగా నచ్చింది. కథానాయకుడు కృష్ణ పాత్ర కోసం సరైన హీరోని వెతుకుతున్న టైంలో నితిన్ అన్నను అడుగుదాం అని నాని సలహా ఇచ్చారు. కృష్ణ పాత్రకు నితిన్ పర్‌ఫెక్ట్‌గా సరిపోయారు అని నిర్మాత దీప్తి గంటా చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: జోమోన్ టి జాన్, సంగీతం: విజయ్ బుల్గానిన్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, రచన-దర్శకత్వం: మురళీకాంత్ దేవసోత్.





























