Skip to main content

Namaste NRI

ఆ దేశానికి ఇదే లాస్ట్ ఛాన్స్ .. లేదంటే లొంగిపోండి

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌కు మ‌రో సారి అల్టిమేటం జారీ చేశారు. ఇరాన్‌తో చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌ని, కానీ ఆ దేశానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నారు. ఇరాన్‌, అమెరికా మ‌ధ్య గ‌త అయిదు నెల‌లుగా వార్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రో వైపు ఇరాన్ మాత్రం అమెరికాతో ఎటువంటి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డం లేద‌ని చెబుతోంది. రెండు దేశాలు విరుద్ద ప్ర‌క‌ట‌న చేస్తున్న నేప‌థ్యంలో, అమెరికా-ఇరాన్ సంక్షోభం ఇప్ప‌ట్లో ముగిసేలా క‌నిపించ‌డం లేదు.

ఓవ‌ల్ ఆఫీసులో ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని ఓ ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చారు. ఇరాన్‌, సౌదీ అరేబియా, యూఏఈ, ఖ‌తార్ రిక్వెస్ట్ మేర‌కు తాము చ‌ర్చ‌ల్లో పాల్గొంటున్న‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు. మంచి ఒప్పందంపై సంత‌కం చేసేందుకు ఇరాన్‌కు ఇది చివ‌రి ఛాన్స్ అని ట్రంప్ అన్నారు. ఇరాన్‌పై మునుపెన్న‌డూ లేని రీతిలో దాడి చేస్తామ‌ని ఇటీవ‌ల హెచ్చ‌రించిన ట్రంప్ ఆ వ్యాఖ్య‌ల‌కు విరుద్ధంగా తాజా కామెంట్ చేశారు.

Social Share Spread Message

Latest News