Skip to main content

Namaste NRI

ఆయన లేకుండానే ఈ వేడుక జరగడం బాధాకరం : దీక్షిత్‌ శెట్టి

1990ల కాలంలో సాగే పీరియడ్‌ క్రైమ్‌ డ్రామా కేజేక్యూ. కింగ్ జాకీ క్వీన్ అనేది ఉపశీర్షిక. దీక్షిత్‌శెట్టి హీరోగా, శశి ఓదెల, యుక్తితరేజా కీలక పాత్రల్లో నటించిన ఈచిత్రానికి స్వర్గీయ కె.కె దర్శకుడు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకులు సంపత్‌నంది, శ్రీకాంత్‌ ఓదెల, సందీప్‌ రాజ్‌, మైత్రీ అధినేత వై.రవిశంకర్‌ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

హీరో దీక్షిత్‌ శెట్టి మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు కిరణ్‌ భౌతికంగా దూరమవ్వడం, ఆయన లేకుండానే ఈ వేడుక జరగడం బాధాకరం. కిరణ్‌ విజనరీ ఫిల్మ్‌ మేకర్‌. ఈ పాత్ర విషయంలో నన్నెంతో నమ్మారాయన. స్నేహం విలువ తెలియజెప్పే ఈ సినిమా పని చేసిన అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుంది అని అన్నారు. ఈ సినిమాలో భాగమైనందుకు హీరో శశి ఓదెల ఆనందం వెలిబుచ్చారు. సినిమా ఎక్కడా ప్రేక్షకుల్ని నిరాశపరచదని నిర్మాత సుధాకర్‌ చెరుకూరి నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events