ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌ఖడ్ పార్లమెంట్‌లో నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ హాజరయ్యారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ అల్వా(80) ఖరారు చేశారు. ఈ మేరకు ఆమె పేరును ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు.