Skip to main content

Namaste NRI

ఇలాంటి సినిమా చేయడం అదృష్టం.. రణ్‌బీర్‌ కపూర్‌

రణబీర్‌ కపూర్‌ హీరోగా నటించిన కొత్త సినిమా షంషేరా. వాణీకపూర్‌ నాయికగా నటిస్తున్నది. సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమా విశేషాలు తెలిపారు. రణ్‌బీర్‌ కపూర్‌ మాట్లాడుతూ దక్షిణాది ప్రేక్షకులు సినిమాలను ఎంతో ప్రేమిస్తారు. నేను కూడా స్ట్రెట్‌ తెలుగు సినిమా చేసే అవకాశం కోసం ఎదరు చూస్తున్నా అని అన్నారు. కరణ్‌ మల్హోత్రా గారు షంషేరా స్క్రిప్ట్‌ చెప్పగానే బాగా నచ్చేసింది. ఈ చిత్రంలో బల్లి, షంషేరా వంటి రెండు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేశాను. సామాజిక విలువల కోసం పోరాడే వ్యక్తిగా కనిపిస్తాను.  ఇలాంటి సినిమా చేయటం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. మా సినిమాను 140 రోజులు చిత్రీకరిస్తే అందులో యాక్షన్‌ సీన్స్‌కే దాదాపు రెండు నెలలు పట్టింది.  ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. తల్లీ కొడుకుల మధ్య ఉండే భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి అని అన్నారు. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి కరణ్‌ మల్హోత్రా దర్శకుడు. ఈ నెల 22న హిందీతో పాటు తమిళం,  తెలుగు భాషల్లో విడుదలవుతోంది.

Social Share Spread Message

Latest News