Skip to main content

Namaste NRI

తెలంగాణ కల్చరల్‌ సొసైటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ

సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్‌ సొసైటీ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న సుంగే కేడుట్‌లోని శ్రీ అరస కేసరి శివన్‌ ఆలయంలో భక్తులు బోనాల వేడుకలను నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ కల్చరల్‌ సొసైటీ ప్రత్యేక పూజలు చేశారు. ఊరేగింపులో బోనాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో బండ శ్రీదేవి మాధవ రెడ్డి, గోనె రజిత నరేందర్‌ రెడ్డి, గడప స్వాతి రమేశ్‌, మద్దుకుంట్ల స్వరూప రాజు, గదంశెట్టి స్వరూప్‌, దార అలేఖ్య ఉన్నారు. ఈ వేడుకలకు సమన్వయకర్తలుగా నంగునూరి సౌజన్య, గర్రెపల్లి కస్తూరి, ఉపాధ్యక్షులు గోనె నరేందర్‌ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్‌ బాబు వ్యవహరించారు.

                ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్‌, భాస్కర్‌ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్‌, జూలూరి సంతోష్‌, రోజా రమణి,  నంగునూరి వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్‌, శ్రీధర్‌ కొల్లూరి, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్‌, శివ ప్రసాద్‌ ఆవుల, కాసర్ల శ్రీనివాస్‌, పెరుకు శివ రామ్‌ ప్రసాద్‌, శశిధర్‌ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్‌, ప్రవీణ్‌ మామిడాలతో తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా సంబరాలు విజయవంతంగా జరిగేందుకు సహయం అందించిన దాతలకు, మై హోమ్‌ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలపై ఉజ్జయని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News