Skip to main content

Namaste NRI

సెక్యూరిటీ చీఫ్‌ కు షాక్‌ ఇచ్చిన జెలెన్‌స్కీ 

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది.  రష్యా సేనల బాంబుల వర్షంలో వందల మంది ఉక్రెయిన్‌ పౌరులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు.   రష్యాపై ఆంక్షలు విధిస్తూన్నా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇదిలా ఉండగా..ఉక్రెయిన్‌ గూఢాచార సంస్థ ఎస్‌బీయూ చీఫ్‌ ఇవాన్‌ బకనోవ్‌తో పాటు ఆ దేశ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ ఇరినా వెనిడిక్టోవాపై దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ వేటు వేశారు. దేశ ద్రోహం కేసుల కింద ఆ ఇద్దర్ని సస్పెండ్‌ చేస్తూ జెలెన్‌స్కీ ఆదేశాలు ఇచ్చారు. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లో సుమారు 60 మంది మాజీ ఉద్యోగులు ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా సుమారు 651 దేశద్రోహ కేసులు నమోదు అయినట్లు జెలెన్‌స్కీ వెల్లడిరచారు. సస్పెన్షన్‌పై ఇద్దరు అధికారులు ఇంకా స్పందించలేదు. ఇద్దర్నీ తొలగించలేదని, కానీ వారిపై విచారణ పెండిరగ్‌లో ఉన్న నేపథ్యంలో పక్కనపెట్టినట్లు జెలెన్‌స్కీ అడ్వైజర్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events