Skip to main content

Namaste NRI

అగ్రరాజ్యంలోకి భారతీయుల అక్రమ వలస

కెనడాలో నివసిస్తున్న పలువురు భారతీయ వలసదారులు అక్రమంగా అగ్రరాజ్యం అమెరికాలోని ప్రవేశించారు. తమ దేశంలోకి అక్రమ వలసకు సంబంధించి అమెరికా సరిహద్దు గస్తీ ఏజెన్సీ కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (సీబీపీ) సంచలన విషయాలు వెల్లడిరచింది. ఈ ఏడాది కెనడా నుంచి 10,562 మంది భారతీయ వలసదారులు అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించారని డాటాలో పేర్కొంది. కాలిఫోర్నియాలో నివసిస్తున్న రాజిందర్‌ పాల్‌ సింగ్‌ అనే వ్యక్తి అరెస్టు నేపథ్యంలో ఈ అక్రమ వలసల విషయం వెలుగులోకి వచ్చింది. కెనడలో నివసిస్తున్న భారతీయ వలసదారులను రాజిందర్‌ సింగ్‌ అమెరికాలోని సియాటల్‌కు అక్రమంగా తీసుకెళ్లారని అధికారులు పేర్కొన్నారు. రాజిందర్‌ 90 సార్లకు పైగా ఉబెర్‌ ట్రిప్పుల ద్వారా 360 మందిని సరిహద్దు దాటించడాని, ఈ బుకింగ్‌లు అన్ని ఒకే అఔంట్‌ నుంచి చేస్తున్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

                ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లో సీబీపీ అధికారులు దాదాపు 1,200 మంది భారతీయులను పట్టుకున్నారు. సరిహద్దు దాటించేందుకు అక్రమ రవాణాదారులు వేలకొద్దీ డాలర్లు చార్జి చేశారని ఆ వర్గాలు తెలిపాయి. దూరాన్ని బట్టి 30 వేల నుంచి 70 వేల వరకు కోరేవారిని అధికారులు తెలిపారు. ఇందులో రవాణా ఖర్చులు, ఫేక్‌ డాక్యుమెంట్లు ఖర్చు ఉంటాయి. రాజిందర్‌ సింగ్‌ కెనడా నుంచి అమెరికా తీసుకుపోయేందుకు 11,500 డాలర్లు చార్జి చేసేవారని, రవాణాకు అతను పలు అకౌంట్లు మెయింటెన్‌ చేసే వాడని తెలిపారు. దర్యాప్తు అధికారులకు ఉబెర్‌ ఇచ్చిన సమాచారంలో అధికారులకు కీలక విషయాలు తెలిశాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events