Skip to main content

Namaste NRI

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇండియానా స్టేట్‌లోని ఓ మాల్‌లో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.  ఇండియానాలోని గ్రీన్‌ఉడ్‌ పార్క్‌లో మాల్‌లో ఉన్న ఫుడ్‌కోర్టులోకి చొరబడిన ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డారు. గాయపడిన వారిని దవాఖానకు తరలించామని పోలీసులు వెల్లడిరచారు.  కాగా ఓ పౌరుడు జరిపిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడని తెలిపారు.  అమెరికాలో కాల్పులు సర్వ సాధారణమైంది. ఏడాది కాలంలో సుమారు 40 వేల మందికి పైగా తుపాకీ కాల్పుల్లో మృతి చెందారని అధికారులు తెలిపారు.

Social Share Spread Message

Latest News