Skip to main content

Namaste NRI

30 ఏండ్ల కల .. ఎట్టకేలకు నెరవేరింది

జాబిల్లిపై ప్రయోగాల్లో అమెరికా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు.  30 ఏండ్ల నిరీక్షణకు తెరపడిరది. శాస్త్రవేత్తల కల సాకారమైంది. జాబిల్లి నుంచి తీసుకొచ్చిన మట్టిలో మొక్కలను పెంచాలన్న వారి లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. చంద్రుడి మట్టిలో నాసా సహకారంతో యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా పరిశోధకులు విజయవంతంగా మొక్కలను పెంచారు. భూమిపై పెరిగే మొక్కల హర్మోన్లను, అకురోత్పత్తి ప్రక్రియను చంద్రుడిపై ఉన్న మట్టి ప్రభావితం చేయలేదని తాజా ప్రయోగం రుజువుచేసింది అని ప్రొఫెసర్‌ అన్నా లీసా పౌల్‌ తెలిపారు. చంద్రడిపై మొక్కలను పెంచితే ఆక్సిజన్‌ ఉత్పత్తి సాధ్యమే. దీంతో ఆవాసాల ఏర్పాటు మరింత సులభవముతుంది. అలాగే, భవిష్యత్తులో భూమి నుంచి చేపట్టే రోదసి మిషన్లను చంద్రుడి నుంచే ప్రారంభించవచ్చు. దీంతో రాకెట్‌ ఇంధనం ఖర్చూ కలిస్తోంది అని ప్రోఫెసర్‌ రాబ్‌ ఫెర్ల్‌ అన్నారు.  చంద్రుడి మట్టిలో విత్తనాలు వేస్తే మొలకెత్తతడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ పరిశోధన భవిష్యత్‌లో మరిన్ని ప్రయోగాలు చేయడానికి బాటలు వేస్తుందని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News