అమరావతి శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు 125 జయంతిని పురస్కరించుకొని భారీగా బ్యానర్లు , ఫ్లెక్సిలు ఏర్పాటు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా ‘స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ ‘ పేరుతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.


ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేపట్టగా అందుకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించారు.అమరజీవి జీవిత విశేషాలతో కూడిన వీడియో, ఫొటో గ్యాలరీ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. వేడుకలకు వచ్చిన వారికి నిర్వాహకులు అల్పాహారం, తాగునీరు,భోజన ఏర్పాట్లు చేశారు.


అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టి జి భారత్, పీ నారాయణ, శ్రీమతి సవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి వి ఎన్ మాధవ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తదితరులు కూడా పాల్గొన్నారు.















