Skip to main content

Namaste NRI

క్ష‌మాప‌ణ చెప్పిన ఆస్ట్రేలియా ప్ర‌ధాని .. ఎందుకో తెలుసా?

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రముఖ పాప్ సింగర్ కైలీ మినోగ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని హోదాలో ఉండి మహిళలను కించపరిచేలా, పదవికి ఉన్న గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడారంటూ ప్రతిపక్ష నేతలు, స్వతంత్ర ఎంపీలు, మహిళా సంఘాలు ఆయనపై విరుచుకుపడ్డాయి. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటడంతో అల్బనీస్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఎవరినైనా నొప్పించి ఉంటే బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 2న విడుదలైన కమెడియన్ నిక్కీ ఓస్బోర్న్ బుష్ డీప్ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ ఓస్బోర్న్ ఆస్ట్రేలియాకు చెందిన ముగ్గురు ప్రముఖ మహిళలు (కైలీ మినోగ్, నటి నికోల్ కిడ్మాన్, ఎంటర్‌టైనర్ రోండా బర్చ్‌మోర్) పేర్లను ప్రస్తావిస్తూ ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ఎవరితో డేటింగ్ చేస్తారు? ఎవరితో శృంగారం చేస్తారు? అని ప్ర‌శ్నించారు.

మొదట తన భార్య జోడీ హేడన్‌ను గుర్తుచేస్తూ అల్బనీస్ ఈ ప్రశ్నను దాటవేయాలని చూసినప్పటికీ హోస్ట్ పదే పదే ఒత్తిడి చేయడంతో పాప్ సింగర్ కైలీ మినోగ్ పేరును ఎంచుకున్నారు. ఆ ముగ్గురిలో కైలీతోనే పెళ్లి, డేటింగ్, శృంగారం అన్నీనా? అని హోస్ట్ అడుగగా అన్నీ ఆమెతోనే. ఆమె అద్భుతమైన మహిళ అని ప్రధాని సమాధానమిచ్చారు.

Social Share Spread Message

Latest News