Skip to main content

Namaste NRI

స్టార్ హీరో కొడుకుతో సచిన్ కూతురు సారా పెళ్లి ఫిక్స్..? అసలు నిజం ఇదే!

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ వివాహంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ కుమారుడు రాజ్‌వీర్‌తో 2027లో సారా ఏడడుగులు వేయబోతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం జరిగిందని, రాజ్‌వీర్ ఆమెకు ఖరీదైన బహుమతులు కూడా పంపుతున్నారంటూ రెడ్డిట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో పోస్టులు వైరల్ కావడంతో క్రికెట్, సినీ వర్గాల్లో కొత్త బంధం మొదలవుతోందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

అయితే ఈ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని టెండూల్కర్ కుటుంబానికి అత్యంత సన్నిహిత వర్గాలు తేల్చిచెప్పాయి. అసలు ప్రచారంలో ఉన్న వ్యక్తిని సారా ఇప్పటివరకు కనీసం కలవలేదని, ఇవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశాయి. ఎలాంటి ఆధారం లేని ఒక చిన్న పోస్ట్ ఇంత వేగంగా వైరల్ కావడంపై సన్నిహిత వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.

మరోవైపు, ఈ వదంతులపై అటు టెండూల్కర్ కుటుంబం కానీ, ఇటు డియోల్ కుటుంబం కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో సారా పెళ్లి వార్త కేవలం సోషల్ మీడియా సృష్టించిన కట్టుకథగా మాత్రమే మిగిలిపోయింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events