ఏ.నరేంద్ర హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం విలేజ్ స్టార్స్. లిల్లీ బళ్లు కథానాయిక. ఎన్ఎస్వీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. నటుడు సమీర్ అతిథిగా వచ్చి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

అందరికీ నచ్చే కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుందని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు, హీరో నరేంద్ర చెప్పారు. ఈ సినిమాలో భాగం అయినందుకు కథానాయిక లిల్లీ బళ్లు ఆనందం వెలిబుచ్చారు. ఇంకా జబర్దస్త్ వాసు, నటుడు రాధాకృష్ణ, సామాజిక కార్యకర్త సంపత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: నాగూర్ ఎన్జీఆర్.















