

అమెరికాలోని శాన్ జోస్ లో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో భారత్, అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.. ‘AIA SWADES 2026’ పేరుతో బే ఏరియా లో పరేడ్ అట్టహాసంగా సాగింది. సినీ నటి తాప్సీ పన్ను పరేడ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారత వైవిధ్యం, వారసత్వం, భారత్ అమెరికా మధ్య స్నేహనికి చిహ్నంగా నిర్వహించిన ఈ పరేడ్ లో 25 వేలకు పైగా ఎన్నారై లు పాల్గొన్నారు. 80 కి పైగా శకటాలు, మార్చింగ్ బృందాలు, 50 కి పైగా భారతీయ అమెరికన్ సంస్థలు పాల్గొన్నాయి. ఈ పరేడ్ లో భారత్ అమెరికా జాతీయ జెండాల ప్రదర్శన ఆకట్టుకుంది.






















