Skip to main content

Namaste NRI

మెల్‌బోర్న్ లో భారత్ కాన్సులేట్ జనరల్ అనీస్ రాజన్ తో ఏపీఎన్ఆర్ టి కోఆర్డినేటర్ల భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నియమించిన ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీ ఎన్ ఆర్ టి)సమన్వయ కర్తలు, మెల్బోర్న్ ప్రతినిధులు మెల్బోర్న్ లో భారత్ కాన్సులేట్ కార్యాలయంలో కాన్సుల్ జనరల్ అనీస్ రాజన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విక్టోరియా, ఆస్ట్రేలియా వ్యాప్తంగా నివసిస్తున్న ప్రవాస తెలుగు వారి సంక్షేమం, అత్యవసర సమయాల్లో సహాయ సమన్వయం, కమ్యూనిటీ సమస్యలను అధికారులకు చేరవేసే విధానంపై చర్చించారు. ప్రమాదాలు, మరణాలు, పాస్పోర్ట్ సమస్యలు తదితర అంశాలపై వేగంగా సహాయము అందించేందుకు ఏపీ ఎన్ ఆర్ టి, కాన్సులేట్ మద్య సమన్వయం వుండాలని ప్రతినిధులు కోరారు, ఈ మేరకు అనీస్ రాజన్ కు వినతిపత్రం అందజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events