న్యూ యార్క్ అటార్నీ జనరల్ పదవి కోసం తెలుగు సంతతి మహిళ సరిత కోమటిరెడ్డి పోటీ పడుతున్నారు. ఆమెకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుండి మద్దతు లభిస్తోంది. దాంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి లెటీటియా జేమ్స్ కు గట్టి ప్రత్యర్థి గా మారింది. డోనాల్డ్ ట్రంప్ సరితా కోమటిరెడ్డి ఆగస్టు 15 న నామినేట్ చేసిన అనంతరం రెండు సార్లు అటార్నీ జనరల్ గా ఉన్న లెటీటియా జేమ్స్ పై విమర్శలు చేశారు. తన విధి నిర్వహణలో జేమ్స్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.

అమెరికా అధ్యక్షుడు తనను నామినేట్ చేయడం గొప్ప గౌరవం గా భావిస్తున్నానని అన్నారు. 41 ఏళ్ల సరితకు న్యాయవృత్తి లో అపారమైన అనుభవం వుంది. ఆమె కుటుంబం దశాబ్దాల క్రితం తెలంగాణ నుండి అమెరికాకు వెళ్లి స్థిరపడింది. బ్రూక్లిన్ లో జన్మించిన సరిత తర్వాత కుటుంబంతో కలిసి ముస్సోరీకి వెళ్లింది. హార్వర్డ్ కాలేజీ మరియు హార్వర్డ్ లా స్కూల్ నుంచి న్యాయ శాస్త్రం లో పట్టా పొందారు. కొలంబియా లా స్కూల్ లో లెక్చరర్ గా పని చేసిన తరువాత ఫెడరల్ ప్రాసిక్యూషన్ విధుల్లోకి వచ్చారు. ప్రస్తుతం హోల్ట్జ్మాన్ వోగెల్ లా సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. న్యూ యార్క్ అటార్నీ జనరల్ పదవికి నవంబరులో ఎన్నిక జరగనుంది.















