Skip to main content

Namaste NRI

అమెరికాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్య

అమెరికాలో గన్‌ కల్చర్‌, దోపిడీకి మరో భారతీయుడు బలయ్యాడు. అక్కడ ఓ దుకాణాన్ని నడుపుతున్న భారతీయుడ్ని గుర్తు తెలియని దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఆగస్టు 20న టెన్నెస్సీ రాష్ట్రం జాక్సన్‌ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో గుజరాత్‌లోని మెహ్సానాకు చెందిన సురేశ్‌ పటేల్‌ (56) ప్రాణాలు కోల్పోయాడు. దోపిడీ చేయడానికి దుకాణంలో చొరబడిన దుండగుడు, అక్కడ ఉద్యోగి నుంచి డబ్బు తీసుకున్న తర్వాత సురేశ్‌ పటేల్‌పై పలుమార్లు కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అతడి 19 ఏండ్ల కుమార్తె కండ్లముందే ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం. పటేల్‌ రిడ్జ్‌ క్రెస్ట్‌ సెల్లార్స్‌ పేరుతో కొద్ది రోజుల క్రితమే ఇక్కడ కొత్త దుకాణాన్ని తెరిచాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events