సుదర్శన్ వంగల, సాత్విక జంటగా తెరకెక్కుతున్న చిత్రం పాటకు ప్రాణం. హేమల్ తుమ్మపూడి దర్శకత్వం వహిస్తూ శ్రీరామ్ తమ్ముపూడితో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి, కథానాయకుడు నిఖిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కథానాయకుడు మాట్లాడుతూ అరుదైన కథతో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో నేను అరుణ్ అనే యువకుడిగా నటిస్తున్నా అన్నారు. ఈ నెల 24 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామనినిర్మాత హేమల్ తుమ్మపూడి తెలిపారు.

సీనియర్ నటుడు తనికెళ్ల భరణి కీలక పాత్ర పోషిస్తుండగా, రాజీవ్ కనకాల, అనితా చౌదరి, రఘు కారుమంచి, బ్రహ్మాజీ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంజీత్ సింగ్ ఛాయాగ్రహణం, ప్రభాత్ రెడ్డి బండ కూర్పు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.















