Skip to main content

Namaste NRI

ఇజ్రాయెల్‌కు అమెరికా భారీ ప్యాకేజీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు 2.8 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.26,000 కోట్లు) విలువైన ఆయుధాలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్యాకేజీలో సుమారు 40,000 భారీ బాంబులు ఉండనున్నాయి. ఒక్కో బాంబు బరువు దాదాపు 900 కిలోలు. అయితే ఈ ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. 2024లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు 2,000 బాంబుల సరఫరాను నిలిపివేసింది. గాజా వంటి జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఉపయోగిస్తే భారీగా ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని బైడెన్‌ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events