ఆస్టిన్: ఆస్టిన్ పాఠశాల, విశ్వగురుకులం 2026–27 విద్యా సంవత్సరాన్ని ఉత్సాహంగా ప్రారంభించాయి. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి తెలుగు కుటుంబాల నుంచి అపూర్వ స్పందన లభించింది.ఈ సంవత్సరం ఆస్టిన్ తెలుగు కుటుంబాలు చూపించిన అపూర్వ స్పందన ప్రత్యేకంగా నిలిచింది. పాఠశాల స్వచ్ఛంద సేవకులు ఆస్టిన్ ప్రాంతంలోని తెలుగు కుటుంబాలను వ్యక్తిగతంగా సంప్రదించి, పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు ప్రోత్సహించారు. దేశవ్యాప్తంగా అత్యధిక పాఠశాల నమోదులను సాధించిన నగరంగా ఆస్టిన్ నిలిచింది.


శ్వేత వేలగలేటి, రాజేష్ గంగబత్తిన, శ్రీదేవి కోట, రామ్‌శ్యామ్ భామిడిపాటి, వల్లీ భామిడిపాటి, కీర్తి సుష్మిత బుద్ద, అనూష చిట్టురి, వాసవి భవాన్సిమి ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు. వంశీ భారద్వాజ్, అర్జున్ కూర, శ్రీనివాస్ బత్తుల, మణి చెన్నుబట్ల స్వచ్ఛంద సేవకులుగా విశ్వగురుకులం కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
సహ అధ్యక్షురాలు రజని మారం ఆస్టిన్ పరిసర ప్రాంతంలో కార్యక్రమాల విస్తరణకు నాయకత్వం వహిస్తూ, తెలుగు కుటుంబాలను వ్యక్తిగతంగా కలుసుకుని మాతృభాష ప్రాధాన్యతను, మన భాషను భావితరాలకు అందించాల్సిన బాధ్యతను వివరించడంతో పాటు, కార్యక్రమాల నిర్వహణ, సమన్వయంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నరు.
విశ్వగురుకులం కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న రామ్ మారం, తరగతుల పునఃప్రారంభ వేడుకలో పాల్గొని, తల్లిదండ్రులకు పాఠశాల, గురుకుల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనమని, వాటి ప్రయోజనాలను మరింత మంది కి చేరేలా సహకరించాలని కోరారు.


తానా అధ్యక్షులు నరేంద్ర కొడాలి, డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి మరియు తానా కార్య వర్గం ఈ కార్యక్రమాల విజయానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తూ, మన తెలుగు భాషా, భారతీయ సంస్కృతులను ఉత్తర అమెరికా వ్యాప్తంగా భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్నారు.
















