Skip to main content

Namaste NRI

తత్వం మూవీ రిలీజ్ డేట్ ఖరారు

మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ తత్వం. దినేష్‌తేజ్‌, దష్విక.కె జంటగా నటించిన ఈ చిత్రానికి అర్జున్‌ కోలా దర్శకుడు. వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటి నిర్మాతలు. అక్టోబర్‌ 2న సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌ కానున్నది. మంచి ఎమోషనల్‌ కనెక్టివిటీ ఉన్న థ్రిల్లర్‌ ఇదని, సంగీతానికి కూడా స్కోప్‌ ఉన్న ఈ సినిమాలో వాణిజ్య అంశాలన్నీ ఉంటాయని, ఇటీవలే విడుదలైన ట్రైలర్‌ కూడా అందరికీ నచ్చిందని నిర్మాతలు పేర్కొన్నారు.

మన చుట్టూ జరుగుతున్న సంఘటనల ఆధారంగా తయారు చేసుకున్న కథ ఇది. వంశీగారి అన్వేషణ తరహాలోనే అందర్నీ కట్టిపడేస్తుంది. ఈ కథలోని ట్విస్ట్‌ అందర్నీ షాక్‌కి గురి చేస్తుంది. చేతన్‌ భరద్వాజ్‌ కథకు తగ్గట్టుగా అద్భుతమైన సంగీతం అందించారు అని దర్శకుడు అర్జున్‌ కోలా తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: భరత్‌ పట్టి, నిర్మాణం: త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events