Skip to main content

Namaste NRI

విజయ్ దేవరకొండ రణబాలి.. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది!

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడిక్‌ చిత్రం రణబాలి. దసరా కానుకగా అక్టోబర్‌ 16న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందనే వార్తలకు చెక్‌ పెడుతూ చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

తన మాతృభూమిని, ప్రజల్ని కాపాడేందుకు ప్రతిజ్ఞబూనిన వీర యోధుడు రణబాలిగా విజయ్‌ దేవరకొండ పవర్‌ఫుల్‌ లుక్‌తో పోస్టర్‌ ఆకట్టుకుంటున్నది. 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్‌ పాలనాకాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: అజయ్‌-అతుల్‌, కథ, దర్శకత్వం: రాహుల్‌ సంకృత్యాన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events