Skip to main content

Namaste NRI

నేపాల్‌లో మ‌రోసారి హై అల‌ర్ట్

ఇటీవ‌లే భారీ వ‌ర‌ద‌ల‌కు అత‌లాకుత‌ల‌మైన నేపాల్ మ‌రోసారి ప్ర‌మాదం అంచున ఉంది. స్థానిక బాగ‌మ‌తి న‌ది ఉప్పొంగుతుండ‌టంతో వ‌ర‌ద ముంచుకొస్తుందేమోన‌ని స్థానికులు ఆందోళ‌న చెందుతున్నారు. నేపాల్‌లో ప్ర‌స్తుతం భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక న‌దుల్లో నీటి ప్ర‌వాహం భారీగా పెరిగింది. ముఖ్యంగా బాగ‌మ‌తి న‌దికి భారీ వ‌ర‌ద నీరు చేర‌డంతో ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తోంది. న‌దీ తీరంలోని అనేక ఇండ్ల‌ను తాకుతూ నీళ్లు ప్ర‌వ‌హిస్తున్నాయి. ఇంకొంచెం నీటి ప్ర‌వాహం పెరిగితే, ఒడ్డున ఉన్న ప్రాంతాల‌ను వ‌ర‌ద ముంచెత్తే అవ‌కాశం ఉంది. అందుకే, ప్ర‌భుత్వం హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించింది.

భారీ వ‌ర్షాల‌కు కొండ చ‌రియ‌లు కూడా విరిగిప‌డే అవ‌కాశం ఉంది. రాజ‌ధాని ఖాట్మండ్, ఇత‌ర ప్రాంతాల‌ను క‌లిపే ర‌హదారుల‌పై నీరు ప్ర‌వ‌హిస్తోంది. ఈ ప్రాంతాల్లోనే వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌ల ముప్పు పొంచి ఉంది. పృథ్వి హైవే, బీపీ హైవే, కంటి లోక్‌పాత్ హైవేలు అనేక చోట్ల నీట మునిగాయి. రోడ్ల‌పై వ‌ర‌ద నీరు చేర‌డంతోపాటు, కొన్ని చోట్ల కొండ చ‌రియ‌లు విరిగి ప‌డ‌టంతో ర‌హ‌దారులు స్తంభించాయి. దీంతో వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. ఒక‌ప‌క్క బాగ‌మ‌తి న‌ది ఉప్పొంగుతుంటే, మ‌రోప‌క్క భారీ నుంచి అతి భారీవ‌ర్షాలు ప‌డే ఛాన్స్ ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events