దీపావళి వేడుకలు మరియు TANTEX 40వ వార్షికోత్సవ వేడుకలకు మరో 30 రోజులు మాత్రమే ఉండటంతో ఉత్సాహం మరింత పెరుగుతోంది. ఈ వేడుకల సందడిలో భాగంగా TANTEX 5K Walk/Run 2026 అక్టోబర్ 3, శనివారం ఉదయం 8:00 గంటల నుంచి 12:00 గంటల వరకు ఫ్రిస్కోలోని Shawnee Trail Sports Complexలో నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమంలో 5K వాక్/రన్‌తో పాటు ఉచిత CPR శిక్షణ, ఆరోగ్య పరీక్షలు, హార్ట్ హెల్త్ అవగాహన కార్యక్రమాలు మరియు Club Pilates East Frisco ఆధ్వర్యంలో ప్రత్యేక Pilates సెషన్, ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయి.

అలాగే Frisco Family Services ప్రతినిధులు కార్యక్రమానికి హాజరై విరాళ చెక్కును స్వీకరించనున్నారు.

కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పాల్గొని ఆరోగ్యం, సమాజ సేవ, స్నేహభావాన్ని చాటుదాం. ప్రతి అడుగు ఒక మంచి మార్పుకు దారితీయాలి అని TANTEX ప్రతినిధులు తెలిపారు.















