Skip to main content

Namaste NRI

భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌కు బ్రేక్?

భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఇరు దేశాలు ఇప్పటికే పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపాయని, ప్రస్తుత స్థాయి నుంచి మరిన్ని రాయితీలు ఇవ్వడం లేదా తీసుకోవడం చాలా కష్టంగా మారవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన మ్యూనిచ్ లీడర్స్ మీటింగ్‌లో మాట్లాడిన సీతారామన్ భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. అయితే ఇరు దేశాలు తమ తమ పరిమితులకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. కొత్తగా రాజీకి లేదా ముందడుగుకు అవకాశం కనిపిస్తే ఇరు పక్షాలు దానిని పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

భారత్‌తో వాణిజ్యంలో అమెరికాకు ఉన్న లోటు ప్రస్తుత చర్చల్లో కీలక అంశంగా మారిందని సీతారామన్ వెల్లడించారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో సమతుల్యత తమకు అనుకూలంగా లేదని అమెరికా భావిస్తోందని, ఈ లోటును తగ్గించుకోవాలని వాషింగ్టన్ కోరుకుంటోందని చెప్పారు. గతంలో వాణిజ్య అసమతుల్యతలను మార్కెట్ యాక్సెస్, పరస్పర రాయితీలు, చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నాలు జరిగేవని ఆమె పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సుంకాలను కూడా వాణిజ్య అసమతుల్యతలను ఎదుర్కొనే సాధనంగా ఉపయోగిస్తున్న పరిస్థితి ఉందని వివరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events