Skip to main content

Namaste NRI

రష్మిక కోసం ఒసేయ్ రాములమ్మ సాంగ్ రీమిక్స్

రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం మైసా. రవీంద్ర పుల్లె దర్శకుడు. ఈ నెల 27న విడుదల కానున్నది. ఈ సినిమాలోని మూడో పాటను మేకర్స్‌ విడుదల చేశారు. బ్లాక్‌బస్టర్‌ ఒసేయ్‌ రాములమ్మ లోని ఓ ముత్యాలరెమ్మ పాటకు ఇది రీ క్రియేషన్‌ కావడం విశేషం. ఈ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో రష్మిక మాట్లాడారు. ఓసేయ్‌ రాములమ్మ పాటను రీక్రియేట్‌ అనగానే కొంచెం భయమేసింది. ఎందుకంటే అలాంటి ఐకానిక్‌ సాంగ్‌ని రీక్రియేట్‌ చేయడం పెద్ద బాధ్యత. ఆ పాటకు న్యాయం చేసేలా ప్రయత్నం చేశాం. వందేమాతరం శ్రీనివాస్‌ ఆ పాట పాడటం ఆనందంగా ఉంది. సుద్దాల అశోక్‌తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు. ఈ రీక్రియేషన్‌కు కూడా మీరు ఆనాటి ప్రేమనే అందిస్తారని ఆశిస్తున్నా అన అన్నారు.

ఓ ముత్యాలరెమ్మ.. ఓ మురిపాల కొమ్మ.. ఓ పున్నమి రెమ్మ.. ఓ పుత్తడి బొమ్మ.. ఓ రాములమ్మా.. రాములమ్మా.. నీ చూపులోయమ్మ.. చురకత్తులేనమ్మ.. నీ చేతులోయమ్మ.. శివుని శూలాలేనమ్మ.. ఓ రాములమ్మ..’ అంటూ ఈ సినిమాలోని రష్మిక పాత్ర స్వభావాన్ని ఆవిష్కరించేలా సుద్దాల అశోక్‌తేజ పాట రాయగా, వందేమాతరం శ్రీనివాస్‌ ఆలపించారు. జేమ్స్‌ బిజోయ్‌ ఈ పాటకు కొత్త మ్యూజికల్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. ఈ పాటను రీక్రియేట్‌ చేయడం పట్ల వందేమాతరం శ్రీనివాస్‌ సంతోషం వెలిబుచ్చారు. తెలంగాణ కోడలు రష్మికకు పాట రాసే అవకాశం రావడం గొప్ప అదృష్టమని సుద్దాల అశోక్‌ తేజ ఆనందం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events