Skip to main content

Namaste NRI

ఆకాశంలో ఒక తారకు అద్భుతమైన రెస్పాన్స్ : అల్లు అరవింద్

అల్లు అరవింద్‌ నిర్మాణ భాగస్వామిగా రూపొందించిన ఆకాశంలో ఒక తార చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దుల్కర్‌ సల్మాన్‌, సాత్విక వీరవల్లి జంటగా నటించిన ఈ చిత్రానికి పవన్‌ సాధినేని దర్శకత్వం వహించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ఈ సినిమా ప్రీమియర్‌షోస్‌ పూర్తయిన దగ్గరి నుంచి నా ఫోన్‌ మోగుతూనే ఉంది. కొందరు పత్రికాధిపతులు కూడా ఫోన్‌ చేసి గొప్ప సినిమా తీశారని మెచ్చుకున్నారు. ఈ సినిమాలో హీరో, విలన్‌ అంటూ ఎవరూ లేరు. అన్నీ హృదయాన్ని కదిలించే పాత్రలే ఉన్నాయి అన్నారు.

దర్శకుడు పవన్‌ సాధినేని తన తదుపరి చిత్రాన్ని మా బ్యానర్‌లోనే చేయబోతున్నాడు. అతని వర్క్‌ అంతలా నచ్చింది. ఈ సినిమాకు ఓవర్సీస్‌ రెస్పాన్స్‌ కూడా అద్భుతంగా ఉంది. దుల్కర్‌ సల్మాన్‌ తన పాత్రలో జీవించారు. ఈ సినిమాతో సాత్విక వీరవల్లి పెద్దస్టార్‌ అయిపోయింది. ఆమె మా సంస్థలో రెండు సినిమాలు చేయబోతున్నది అన్నారు.
అల్లు అరవింద్‌తో కలిసి ఎన్నో సినిమాలు చేశానని, ఈ విజయం చాలా ప్రత్యేకమని నిర్మాత అశ్వనీదత్‌ ఆనందం వ్యక్తం చేశారు. ప్రీమియర్‌షోస్‌ నుంచి తన ఫోన్‌ మోగుతూనే ఉందని, అదే ఈ సినిమా విజయానికి కొలమానమని, ఈ సినిమా విషయంలో తమ నమ్మకం నిజమైందని దర్శకుడు పవన్‌ సాధినేని ఆనందం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events