Skip to main content

Namaste NRI

హనుమంతుడి ఆశీస్సులతో ఈ సినిమా విజయం : శోభినవ్‌ సత్య

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్‌ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా రూపొందించిన హనుమాన్‌ అంశ్‌ చిత్రం దేశీయ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నది. శోభినవ్‌ సత్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి విశాల్‌ చతుర్వేది దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్నది. తెలుగులో ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో శోభినవ్‌ సత్య మాట్లాడుతూ హనుమంతుడి ఆశీస్సులతో ఈ సినిమా ఈ స్థాయిలో విజయం సాధించిందని, ఇది భారతీయ ప్రజల చిత్రమని అన్నారు. రెండు కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా 400కోట్లు వసూలు చేయడం మామూలు విషయం కాదని, తెలుగులో కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని మైత్రీ మూవీ మేకర్స్‌ రవిశంకర్‌ పేర్కొన్నారు. మనందరం హనుమంతుడి భక్తులమేనని, థియేటర్లలో ఈ సినిమాను ఆస్వాదించాలని దర్శకుడు విశాల్‌ చతుర్వేది కోరారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events