అనీష్ని హీరోగా పరిచయం చేస్తూ మహేష్ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మిస్తున్న చిత్రం ఇట్లు అర్జున. అనస్వర రాజన్ కథానాయిక. ఈ సందర్భంగా వైజాగ్ గీతం యూనివర్సిటీలో ఈ సినిమాలోని యెల్లో చున్నీ సాంగ్‌ని లాంచ్ చేశారు. శ్రీజో రాసిన ఈ పాటను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరపరిచి, విశాల్ మిశ్రాతో కలిసి ఆలపించారు. అనీష్, అనస్వర రాజన్ స్క్రీన్ ప్రెజన్స్ ఈ పాటకు అందాన్ని తెచ్చింది. స్క్రీన్‌పై వారిద్దరి కెమిస్ట్రీ యువతను ఆకట్టుకుంటుంది.

అనీష్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రత్యేకంగా అలరించాయి. థియేటర్లలో స్పీకర్లు కాలిపోయే సంగీతం ఈ సినిమాకు నేనివ్వలేదు. ప్రేక్షకుల మనసులు కదిలిపోయే సంగీతం ఇచ్చాను. అది రేపు సినిమాలో వింటారు. ఇదిచాలా కొత్త కంటెంట్. ఇందులో అనిరుధ్ పాడిన హాయ్ రే పాటకు మంచి స్పందన వచ్చింది. మిగతా పాటలు కూడా తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటాయి అని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పారు. ఈ పాటను అబ్బాయిలందరికీ డెడికేట్ చేస్తున్నానని కథానాయిక అనస్వర రాజన్ పేర్కొన్నారు. ఇంకా హీరో అనీష్, డైరెక్టర్ మహేశ్, కొరియోగ్రాఫర్ ఫాల్గుణి కూడా మాట్లాడారు. ఈ నెల 30న సినిమా విడుదల కానున్నది.















