Skip to main content

Namaste NRI

ఎల్లమ్మ వచ్చేది అప్పుడే!

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, గ్రామ దేవతలు, జానపద కళాకారుల నేపథ్య ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం ఎల్లమ్మ. వేణు యెల్దండి దర్శకత్వం. ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన డప్పు కళాకారుడు పర్షి పాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నదని, పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, సమర్పణ: దిల్‌ రాజు, నిర్మాత: శిరీష్‌, రచన-దర్శకత్వం: వేణు యెల్దండి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events