నిధి అన్వేషణ ప్రధాన ఇతివృత్తంగా రూపొందిస్తున్న చిత్రం సన్ ఆఫ్ కనకదుర్గమ్మ. లయ, అనురూప్ కటారి, ఆకాంక్ష త్యాగరాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దుర్గ ఫణిందర్ దర్శకుడు. దసరా సందర్భంగా ఈ సినిమా స్పెషల్ పోస్టర్ను ప్రముఖ నిర్మాతలు అశ్వనీదత్, స్వప్నదత్ విడుదల చేశారు. ఇందులో నటి లయ అమ్మవారి అవతారంలో శక్తివంతంగా కనిపిస్తున్నారు.

నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే ఈ కథలో విజువల్స్, యాక్షన్ ఘట్టాలు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయని, దుష్టశిక్షణ గావించే అమ్మవారి అవతారంలో లయ కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందిస్తాయని చిత్రబృందం పేర్కొన్నది. ఈ చిత్రానికి సంగీతం: శశిధర్ లంక, కథ: కాకర్ల గోవర్ధన రావు, నిర్మాతలు: వాణి శంకర్, తిలోత్తమ, దర్శకత్వం: దుర్గ ఫణిందర్ లంక.















