Skip to main content

Namaste NRI

దక్షిణాఫ్రికాలో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు

దక్షిణాఫ్రికాలోని జోహానెస్‌బర్గ్, కేప్‌టౌన్‌లలో సద్దుల బతుకమ్మ, దేవీ నవరాత్రులు, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. జోహానెస్‌బర్గ్‌లోని నాగయ్యాస్ మాల్‌లోని దేవీ మండపంలో శ్రీసాయిదర్శన్ ఛారిటబుల్ సంస్థ (ఎస్ఎస్‌డీసీవో), కేప్‌టౌన్‌లో తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.

తొలుత బతుకమ్మలను చేసి గౌరీదేవికి పూజలు నిర్వహించారు. తర్వాత ఆటపాటలతో సందడి చేశారు. జోహానెస్‌బర్గ్‌లో ఎస్ఎస్‌డీసీవో కమిటీ సభ్యులు అరుణ్ సుంకు, రాజేశ్ యార్లగడ్డ, శ్రీధర్ బొల్లోజు, సాతులూరి లక్ష్మీ శ్రీనివాస్, నిర్మల్ నల్లుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కేప్‌టౌన్‌లో తెలుగు సంఘం నేతలు చేతన్ కొరోబోయిన తదితరుల నేతృత్వంలో వేడుకలు జరిపారు. దక్షిణాఫ్రికాలో స్థిరపడిన ప్రవాస తెలుగు కుటుంబాలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events