Skip to main content

Namaste NRI

వెంకటేష్ ఆదర్శ కుటుంబం నుంచి మాలా సాంగ్ రిలీజ్

వెంకటేశ్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆదర్శకుటుంబం హౌస్ నెంబర్ 47. అత్యంత వినోదాత్మకంగా, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలతో కూడిన కథాంశంతో త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.

మ్యూజిక్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి రెండో పాటను మేకర్స్‌ విడుదల చేశారు. మాలా వచ్చా చూడు.. చాలా తెచ్చా పాలు.. నలగాలీ పూలూ ఒళ్లు.. అరవాలీ మంచం కోళ్లు అంటూ సాగే ఈ రొమాంటిక్‌ మాస్‌ గీతాన్ని వెంకటేశ్‌, నివేదా పేతురాజ్‌లపై చిత్రీకరించారు.

ఈ పాటలో వెంకీ, నివేదాల స్క్రీన్‌ ప్రెజన్స్‌, కెమిస్ట్రీ, ఉత్సహభరితమైన వారి అభినయం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను తమన్‌ స్వరపరచగా, ధనుంజయ్‌ సీపాన, రణినారెడ్డి ఆలపించారు. భాను మాస్టర్‌ నృత్య రీతుల్ని సమకూర్చారు. త్వరలోనే ట్రైలర్‌ విడుదల కానున్నది. శ్రీనిధిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవి కె.చంద్రన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events